ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రయాణం చేస్తుండగా మహిళకు పురిటినొప్పులు

ABN, First Publish Date - 2020-11-13T08:09:59+05:30

బెంగళూరు నుంచి అస్సాం వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ప్రయాణం చేస్తున్న మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి బందన్‌రాయ్‌, జయ్‌ధన్‌రాయ్‌ దంపతులు అస్సాం వెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తుని ఆసుపత్రికి చేర్చిన రైల్వే పోలీసులు
  • ఆస్పత్రిలో ప్రసవం

తుని, నవంబరు 12: బెంగళూరు నుంచి అస్సాం వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ప్రయాణం చేస్తున్న మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి బందన్‌రాయ్‌, జయ్‌ధన్‌రాయ్‌ దంపతులు అస్సాం వెళ్తున్నారు. మార్గమధ్యలో సామర్లకోట దాటిన తర్వాత బందన్‌రాయ్‌కి పురుటినొప్పులు రావడంతో ఆ విషయాన్ని రైల్వే టోల్‌ ఫ్రీ నెంబరుకు, తుని రైల్వేస్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ షేక్‌ అబ్ధుల్‌మారూఫ్‌, సిబ్బంది లత, శేఖర్‌, నాని తదితరుల సహాయంతో 108కు సమాచారం ఇచ్చి తుని రైల్వేస్టేషన్‌కు రప్పించారు. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి గర్భిణిని తీసుకుని వెళ్లారు. ఆమెకు వైద్యులు చికిత్స అందించడంతో పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. సకాలంలో వైద్యం అందడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అనంతరం ఆమె భర్త జయధన్‌రాయ్‌ తుని రైల్వే పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-11-13T08:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising