ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో ఇళ్లు ఎందుకివ్వలేదు

ABN, First Publish Date - 2020-12-29T07:00:52+05:30

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 28: రాష్ట్రంలో ఈనెల 25న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇవ్వలేదో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కట్టిన ఇళ్లను లబ్ధిదారుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు 

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 28: రాష్ట్రంలో ఈనెల 25న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇవ్వలేదో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇంకా ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఆయా ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. కనీసం ఇళ్లలోకి వెళ్తేనైనా సొంత ఇంటిలోకి వచ్చామన్న కొంత ఊరట ఉంటుందని, అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న గంటకో నిర్ణయాల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల సేకరణలో రూ.500 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్థల సేకరణకు రూ.4వేల కోట్లు, చదునుకు రూ.2వేలకోట్లు నాయకులు, ఇతరులకు లబ్ధి చేకూర్చేందుకు కలిపి మొత్తం దోచుకున్నారని విమర్శించారు. ఆవ భూములపై సీబీఐ విచారణ పడినా ఇంకా వైసీపీ నాయకులకు సిగ్గులేదని ఆదిరెడ్డి మండిపడ్డారు. 

Updated Date - 2020-12-29T07:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising