ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిలెన్స్‌ రిపోర్టులో మా పేర్లు లేవు

ABN, First Publish Date - 2020-02-23T06:33:48+05:30

ఈఎస్‌ఐ విషయంలో విజిలెన్స్‌ రూపొందించిన రిపోర్టులో అచ్చెన్నాయుడు, తన పేర్లు లేకపోయినా.. తమను వదిలిపెట్టమని రాష్ట్ర మంత్రి జయరాం చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి జయరామ్‌ కావాలనే బురద జల్లుతున్నారు

భూసేకరణ పేరుతో ఎస్సీ, బీసీల భూములను లాక్కుంటున్నారు 

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ


రాజమహేంద్రవరం సిటీ ఫిబ్రవరి 22:  ఈఎస్‌ఐ విషయంలో విజిలెన్స్‌ రూపొందించిన రిపోర్టులో అచ్చెన్నాయుడు, తన పేర్లు లేకపోయినా.. తమను వదిలిపెట్టమని రాష్ట్ర మంత్రి జయరాం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘మంత్రి జయరాం ఒక బ్రిఫ్‌ నోట్‌ ప్రెస్‌కి ఇచ్చి నేను, అచ్చెన్నాయుడు అవినీతి పరులను పేర్కొన్నారు. మంత్రికి పరిపాలనలో అవగాహనలేదు. విజిలెన్స్‌ రిపోర్టు ముందు సీఎం వద్దకు వెళ్లి అటుపై సెక్రటరీ, అటుపై మం త్రి వద్దకు వస్తాయని దానిపై విచారణ జరిపాక ఎవరు తప్పు చేశారో తెలుతుంది. అలా కాకుండా నేరుగా మమ్మల్ని దోషులుగా చూపించడం ఏమిటి’ అని మండిపడ్డారు. ఎవరైతే ఈఎస్‌ఐ డైరెక్టర్‌ రవికుమార్‌ ఉన్నప్పుడు అవినీతి జరిగిందంటున్నారని అదే డైరెక్టర్‌పై తానే గతంలో విచారణకు ఆదేశిస్తూ జివో 46ను జారీ చేశానన్నారు.


రమేష్‌పై ఓ పైల్‌ తనకు వస్తే దాని పై విచారణకు జీవో 730 జారీ చేసి ఆర్డర్‌ పాస్‌ చేశానని, ఆ రెండు రిపోర్టులు ఏమయ్యాయని పితాని ప్రశ్నించారు. ఎవరైతే బలంగా టీడీపీలో వాణి వినిపిస్తూన్నారో  వారిపై బురద జల్లుతున్నారని, ఈఎస్‌ఐలో ఎవరి వల్ల అవినీతి జరిగిందో తెలాలన్నారు. రాజకీయపార్టీలకు సామాజిక వర్గాలు అవసరమైన కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం నీతివంతగా పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో బిల్లులను నవరత్నాల పథకం పేరుతో పంపిణి చేస్తున్నారన్నారు. 


సన్నబియ్యం అన్నారని, సన్నబియ్యం ఉత్పత్తి రాష్ట్రంలో 40 వేల నుంచి లక్ష టన్నులు ఉందని, అది సరిపోకపోవడంతో లావు బియ్యాన్ని సన్నబియ్యంగా తయారు చేసి వాటిలో పోషకాలు లేకుండా చేశారని మాజీ మంత్రి పితాని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు గతంలో బీసీ, ఎస్సీలకు ఇచ్చిన భూములను లాక్కుంటున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా దళిత, వెనుకబడిన వర్గాలు ఈ భూములు వుంటే వారు అమ్ముకోవడానికి లేదన్నారని, అయితే ఇప్పుడిచ్చే ఇళ్ల స్థలాలు ఐదేళ్ళు పూర్తయ్యాక అమ్మేసుకునే హక్కు కల్పిస్తూన్నారని ఇదేక్కడ న్యాయమన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్నా విధానాలతో పెట్టుబడులు రాక రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని మాజీ మంత్రి అన్నారు. 

Updated Date - 2020-02-23T06:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising