ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొరాయించిన సర్వర్లు

ABN, First Publish Date - 2020-07-08T10:30:40+05:30

సర్వ ర్లు మొరాయించడంతో వరుసగా రెండో రోజూ రేషన్‌ సరుకుల సరఫరా నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట/పిఠాపురం/గొల్లప్రోలు, జూలై 7: సర్వ ర్లు మొరాయించడంతో వరుసగా రెండో రోజూ రేషన్‌ సరుకుల సరఫరా నిలిచిపోయింది. చౌకధరల దుకాణా ల్లో ఈ పోస్‌ యంత్రాలపై బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు సేకరించి రేషన్‌కార్డుల ద్వారా సరుకుల సరఫరా చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌ మొరాయించింది. ఆన్‌లైన్‌లో కనెక్టు కాకపోవడం, కార్డుదారులు వేలిముద్రలు వేసినా స్వీకరించకపోవడంతో సరుకుల సరఫరా నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాలతో పాటు మండలాలు, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కార్డుదారులు రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు పడి నిరాశతో వెనుతిరగడం కనిపించింది.


అమరావతిలో సెంట్రల్‌ సర్వర్‌లో సమస్య ఏర్పడినట్లు చెబుతున్నారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడిందని, పరిష్కరించేవారు లేరని అధికారవర్గాలు వెల్లడించాయి. సర్వర్‌ అందుబాటులోకి రాకుం టే మాన్యువల్‌ పద్ధతిలో సరుకులు అందించాలని కార్డుదారులు కోరుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమస్య ఎందుకు వస్తోందో డీలర్లకు కూడా అర్ధం కావడం లేదు. పౌరసరఫరాల అధికారు లతో కూడా డీలర్లకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సాయంత్రం వరకు ఎదురు చూసిన డీలర్లు మంగళ వారం కూడా తిరిగి అదే సమస్య ఎదుర్కోవాల్సి రావ డంతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు కొద్ది గంటలపాటు ఎదురు చూడాల్సిందేనని పేర్కొన్నట్టు సమాచారం మంగళవారం మధ్యాహ్నం కూడా సర్వర్లు పని చేయ కపోవడంతో ఈ పోస్‌లు లాగిన్‌ చేయలేక పోయారు. ఈ నేపధ్యంలో రేషన్‌ సరుకులు పొందేందుకు లభ్ధిదారులు గంటలతరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. సర్వర్‌ డౌన్‌తో ఒక రెవెన్యూ, రేషన్‌ డీలర్లు మాత్రమే కాకుండా ఈ పంట నమోదు.రైతు భరోసా కేంద్రాలలో నమోదులు .


సాగు హక్కుదారుల కార్డుల నమోదు వంటి అంశాలే కాక పలు ధృవీకరణ పత్రాలు జారీకి గడిచిన 36 గంటలుగా తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. జిల్లాలో అన్ని రెవెన్యూ కార్యాలయాలకు సుమారు 70 వేల మేర వివిధ సేవలకు చెంది ధవ పత్రాలు దరకాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది.

Updated Date - 2020-07-08T10:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising