ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు

ABN, First Publish Date - 2020-10-01T08:07:51+05:30

కళ్ల ఎదుట ఓ వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సహాయం చేయలేని దుస్థితి జీజీహెచ్‌లో నెలకొంది. కరోనా వైరస్‌ మహమ్మారి భయం మానవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది


 జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 30: కళ్ల ఎదుట ఓ వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సహాయం చేయలేని దుస్థితి జీజీహెచ్‌లో నెలకొంది. కరోనా వైరస్‌ మహమ్మారి భయం మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడు రోజులుగా ఓ గుర్తు తెలియని 60-70ఏళ్ల వృద్ధుడు కిందపడి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. సిబ్బంది, వైద్యులు వృద్ధుడిని చూసుకుంటూ వెళుతున్నారే తప్పా  ఏ ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. 


 కాకినాడ జీజీహెచ్‌లో మెడికల్‌ వార్డు విభాగం సమీపంలో కోరమండల్‌ తాగునీటి ప్లాంటు వద్ద ఆ అభాగ్యుడు కొన ఊపిరితో ఉన్నాడు. నిత్యం వైద్య సేవల కోసం వందలాది మంది రోగులు, సహాయకులు, వారితో పాటు ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఇదే రూటులో రాకపోకలు సాగిస్తుంటారు.


అయితే నేలపై పడి ఉన్న వృద్ధుడిని చూచిన ఓ ఒక్కరూ కనీసం మానవతా దృక్పథంతో అసలు ఏం జరిగింది అని కూడా అడగడం లేదు. వైద్య చికిత్స అందించేందుకు  వార్డులోకి కూడా చేర్పించకపోవడం దారుణం. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2020-10-01T08:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising