ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నవంబరు 6 వరకు గడువు

ABN, First Publish Date - 2020-10-01T08:18:37+05:30

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనకు భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసిందని నియోజకవర్గ ఎలక్ర్టోరల్‌ రిజిస్ర్టే షన్‌ అధికారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు. ఈ మేరకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతి నిధులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్‌ వారికి వివ రించి సహకారం కోరారు.


అనంతరం మాట్లాడుతూ అక్టోబరు 1న పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసి, 15న ఒకసారి, 25న రెండోసారి సదరు నోటీస్‌ను మీడియాకు విడుదల చేస్తామన్నారు. ఈనెల 1 నుంచి నవంబరు 6 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. డిసెంబరు 1న ముసాయిదా ఓటరు జాబితా ముద్రిస్తామన్నారు. డిసెంబరు 1 నుంచి 31 వరకు క్లైయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు.


ఈనెల 1 నుంచి నవంబరు 6 వరకు నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఫారం 19 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియ నిమిత్తం ఉభయగోదావరి జిల్లాల్లో 116 మంది అసిస్టెంట్‌ ఈఆర్‌వోలు (సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్‌లు) 115 మంది డిజిగ్నేటెడ్‌ అధికారులను (ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు) ప్రభుత్వం నియమించిందదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నుంచి ఏ సునీల్‌, టీడీపీ నుంచి పి వెంకటేశ్వరరావు, బీఎస్పీ నుంచి ఎస్‌ అప్పారావు, సీపీఎం నుంచి           ఎం రాజశేఖర్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగ డిప్యూటీ తహసీల్దార్‌ ఎం జగన్నాథం పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T08:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising