ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు లోకేశ్ రాక

ABN, First Publish Date - 2020-10-19T07:24:30+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ సోమవారం జిల్లాకు రానున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధిత రైతులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వర్షం ముంపు బాధితులు, రైతులతో ముఖాముఖి 

జగ్గంపేట/ప్రత్తిపాడు/పిఠాపురం/కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ సోమవారం జిల్లాకు రానున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధిత రైతులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉదయం జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో  ముంపు బారిన పడిన చేలను చూస్తారు. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద సుద్దగడ్డ వరద బాధితులు, రైతులతో  మాట్లాడతారు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏలేరు వరద ముంపునకు గురైన పొలాలను పరిశీలిస్తారు. అనంతరం పిఠాపురం పట్టణం, మండలం మీదుగా గంటలకు ఉప్పాడ చేరుకుని అక్కడ సముద్రపు కోతను        పరిశీలించి మత్స్యకారులు, బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం అనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెదపూడి, దోమాడ గ్రామాల్లో పర్యటిస్తారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన ఇళ్లను చూసి బాధిత రైతులు, ప్రజలను పరామర్శిస్తారు.

Updated Date - 2020-10-19T07:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising