అమ్మో.. కరోనా..!
ABN, First Publish Date - 2020-03-16T08:46:16+05:30
అమ్మో.. కరోనా... ఎక్కడ చూసినా ఇదే భయం. కాస్త దగ్గు వచ్చినా.. తుమ్ము వచ్చినా.. కరోనానా అనే అనుమానం. దీని కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో
జిల్లావ్యాప్తంగా అనుమానితులు కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు
ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్‌వార్డులో చికిత్స
శ్వాబ్‌లు తీసి వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్‌కు తరలింపు
విదేశాలనుంచి వచ్చిన వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జీజీహెచ్(కాకినాడ), మార్చి 15:
అమ్మో.. కరోనా... ఎక్కడ చూసినా ఇదే భయం. కాస్త దగ్గు వచ్చినా.. తుమ్ము వచ్చినా.. కరోనానా అనే అనుమానం. దీని కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ఈ మహమ్మారి వ్యాధి భారత్‌లోను ప్రవేశించింది.
ఇటీవల కొందరు దీని బారిన పడ్డారు. ముఖ్యంగా జిల్లాకు విదేశాలనుంచి వచ్చేవారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. జిల్లాలో పలుచోట్ల ఇలాంటి వారు ఉండగా వారిని గుర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి శ్వాబ్‌ను కరోనా వ్యాధి నిర్ధారణ నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నారు. గతంలోను ఇలా కొందరు అనుమానితుల నమూనాలను పంపినా ఇప్పటివరకు అన్నీ నెగటివ్‌గానే వచ్చాయి.
Updated Date - 2020-03-16T08:46:16+05:30 IST