ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-29T06:33:27+05:30

భర్త చేతిలో చిత్రహింసలకు గురవ్వడంతోపాటు అతడి చేతిలో మోసపోయి ఆర్థికంగా చితికిపోయిన తనను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని ఆత్మహత్యాయత్నం విఫలమై రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన లత అనే మహిళ వేడుకుంటోంది. తిరుపతి పోలీస్టేషన్‌తోపాటు దిశ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరగలేదని వాపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • తిరుపతికి చెందిన వివాహిత వేడుకోలు
  • భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
  • రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 28: భర్త చేతిలో చిత్రహింసలకు గురవ్వడంతోపాటు అతడి చేతిలో మోసపోయి ఆర్థికంగా చితికిపోయిన తనను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని ఆత్మహత్యాయత్నం విఫలమై రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన లత అనే మహిళ వేడుకుంటోంది. తిరుపతి పోలీస్టేషన్‌తోపాటు దిశ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరగలేదని వాపోయింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... తిరుపతి పోస్టల్‌ కాలనీకి చెందిన లత అదే ప్రాంతానికి చెందిన కుమార్‌ అనే యువకుడిని పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఆమె భర్త షేర్లు, ఇతర జూదాలకు వ్యసనపరుడై రూ.25లక్షలు అప్పులు చేశాడు. భర్త వేధింపులు, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక మరణమే శరణమని భావించి ఐదురోజుల క్రితం తిరుపతిలో బస్సెక్కి కట్టుబట్టలతో రాజమహేంద్రవరం వచ్చింది. రోడ్డుకంరైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గోదావరిలో కొట్టుకుపోతున్న ఆమెను కొందరు రక్షించి ఆర్టీసీ బస్టాండుకు తీసుకొచ్చి తిరుపతి పంపడానికి ప్రయత్నించినా అప్పటికే నిద్రమాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. దీంతో అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. తన సమాచారాన్ని పోలీసులు తిరుపతిలో ఉంటున్న భర్త కుమార్‌కు, కుటుంబ సభ్యులకు తెలియజేసినా వారు లెక్కచేయడంలేదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో ఐదురోజులుగా ప్రభుత్వాస్పత్రిలోనే ఉన్నా ఎవ్వరూ రాలేదని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, లేకుంటే బతికి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కలెక్టర్‌ను కలిసి బాధ చెప్పుకోవడానికి తనకు అవకాశం కల్పించాలని వేడుకుంటోంది.

Updated Date - 2020-11-29T06:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising