ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుద్దగడ్డను ఆధునీకరించకే వరద ముంపు

ABN, First Publish Date - 2020-10-03T06:10:52+05:30

సుద్దగడ్డ కాలువను ఆధునికీరణ చేయకపోవడం వల్లే పంట పొలాలన్నీ తీవ్ర వరద ముంపునకు గురయ్యా యని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రమణక్కపేట(కొత్తపల్లి), అక్టోబరు 2: సుద్దగడ్డ కాలువను ఆధునికీరణ చేయకపోవడం వల్లే పంట పొలాలన్నీ తీవ్ర వరద ముంపునకు గురయ్యా యని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌వర్మ అన్నారు. ఏలేరు వరదలతో రమణక్కపేటలో పూర్తిస్థాయిలో వరద నీటిలో మునిగిన పొలాలకు చెందిన బాధిత రైతులతో ఆయన  శుక్రవారం మాట్లాడారు. గ్రామంలో 1600 ఎకరాలకు చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీరణకు రూ.130 కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు.


ఈ నిధుల్లో పెదయేరు అభివృద్ధి కూడా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 15నెలలు కావస్తున్నా నేటికీ కాలువలు అభివృద్ధికి నోచుకోలేదని వర్మ విమర్శించారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, కాలువ ఆధునికీకరణ పనులు, పెదయేరు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, పెనుమల్లు కృష్ణారెడ్డి, కఠారి రాజబాబు, బత్తుల చైతన్యరాజేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising