ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలోనే ఉరేసుకున్న ఉపాధ్యాయుడు

ABN, First Publish Date - 2020-12-13T05:46:08+05:30

అప్పుల బాధలు తాళలేక ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అన్నపూర్ణంపేటకు చెందిన సుబ్బారావు (48) రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని నన్నయ్య హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

పాఠశాలలోనే ఉరేసుకున్న ఉపాధ్యాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ జూలై  12: అప్పుల బాధలు తాళలేక ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అన్నపూర్ణంపేటకు చెందిన సుబ్బారావు (48) రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని నన్నయ్య హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో తన సహచర ఉద్యోగికి ఒక లోన్‌ విషయంలో ష్యూరిటీ సంతకం చేశారు. కొంతకాలం డబ్బులు కట్టిన అనంతరం ఆ  వ్యక్తి ఉద్యోగం వదిలి అదృశ్యమయ్యాడు. దీంతో రుణం తీర్చే బాధ్యత సుబ్బారావు నెత్తిన పడింది. దీనికి తోడు  బయట కూడా అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వచ్చే జీతం అప్పులకు సరిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో రెండో శనివారం సెలవు దినం అయినప్పటికీ పాఠశాలకు వచ్చిన సుబ్బారావు పై అంతస్తులో తాడుతో ఫ్యాను ఉక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కింద నాడు-నేడు పనులు చేస్తున్న సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం చేసిన సహచర ఉద్యోగి, డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టిన వారు ఎవరనే దానిపై విచారణ చేపట్టారు.

 

Updated Date - 2020-12-13T05:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising