ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి

ABN, First Publish Date - 2020-11-13T05:48:56+05:30

గోకవరం, నవంబరు 12: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అధికారులకు సూచించారు. గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి, అచ్చుతాపురం, గోకవరం తదితర గ్రామాల్లో గురువారం

సచివాలయంలో సేవలు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి

గోకవరం, నవంబరు 12: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అధికారులకు సూచించారు. గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి, అచ్చుతాపురం, గోకవరం తదితర గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తహశీల్దార్‌ కె.పోసిబాబు, ఎంపీడీవో కె.కిషోర్‌ కుమార్‌, పంచాయతీ విస్తరణాధికారి రాజేశ్వరరావు, కార్యదర్శులు టి.శ్రీనివాస్‌, గోపన్నదొర, వీఆర్వోలు ధర్మరాజు, తులసి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-13T05:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising