ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

ABN, First Publish Date - 2020-11-21T06:08:05+05:30

విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలిచేలా నాణ్యమైన బోధనను అందించాలని ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ఆదిత్య ఉపాధ్యాయులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య

రంపచోడవరం, నవంబరు 20: విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలిచేలా నాణ్యమైన బోధనను అందించాలని ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ఆదిత్య ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అమ్మఒడి, జగనన్న విద్యాకానుకలు, వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్నతోడు, వనదన వికాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాల్లో పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9, 10వ తరగతి పిల్లలను పాఠశాలలో చేర్పించి కొవిడ్‌ నియంత్రణ చర్యలు పాటిస్తూ విద్యా బోధన చేపట్టాలని, హాజరు 20శాతం కన్నా తగ్గితే సంబందిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడు మండలాల్లో సుమారు ఐదు వేల మందికి ఆధార్‌ నమోదు కాలేదని పథకాల అమలు ద్వారా గుర్తించినట్టు తెలిపారు. జగనన్న విద్యా కానుకలు ప్రతీ విద్యార్థికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు.  వనదన వికాస కేంద్రాల కేంద్రాల ద్వారా సేకరించిన జీడిమామిడి ఉత్పత్తులకు పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో జీడిమామిడి ప్రోసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం ఎం.జగన్నాథరెడ్డి, వెలుగు ఏపీడీ వై.సత్యంనాయుడు, ఏంపీడీవోలు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యువోలు, వివిధ శాఖల బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T06:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising