ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు అండగా ఉండాలి

ABN, First Publish Date - 2020-11-26T05:48:16+05:30

మహిళల రక్షణకు ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్నీ అద్నాన్‌ నయీం అస్మీ అన్నారు.

నియామక పత్రం అందిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా సంరక్షణ కార్యదర్శులతో ఎస్పీ అస్మీ

కాకినాడ క్రైం, నవంబరు 25: మహిళల రక్షణకు ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్నీ అద్నాన్‌ నయీం అస్మీ అన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 64 మంది అభ్యర్థులకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహిళల రక్షణే ధ్యేయంగా ఉద్యోగులు పని చేయాలని కోరారు.  క్రమశిక్షణతో నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని ఏఎస్పీ కరణం కుమార్‌ కోరారు. 

 పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలి

 జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీ,ఎస్టీ కేసులలో మహిళలు, బాలికలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వెంటనే పూర్తి చేసి అరెస్ట్‌లతో పాటు చార్జిషీట్‌ ఫైలింగ్‌ సకాలంలో జరగాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ కరణం కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ వీఎస్‌ ప్రభాకర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీలు అంబికా ప్రసాద్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వైఆర్‌కే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-11-26T05:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising