ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు

ABN, First Publish Date - 2020-12-29T06:34:35+05:30

జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగిన జిలా ్లస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు సోమవారం ముగిసాయి.

విజేతలతో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ స్పోర్ట్స్‌, డిసెంబరు 28: జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగిన జిలా ్లస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు సోమవారం ముగిసాయి. ముగింపు సభకు అధ్యక్షత వహించిన సంఘ అధ్యక్షుడు కలవల కృష్ణమూర్తి (గాంధీ) మాట్లాడుతూ జిల్లాలో సాఫ్ట్‌ టెన్నిస్‌ క్రీడాభివృద్ధికి కృషిచేస్తాన్నారు. అనంతరం ముఖ్య అతిఽఽథిగా విచ్చేసిన డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ సురేష్‌కుమార్‌ విజేతలకు బహుమతలు అందజేశారు. సబ్‌ జూనియర్స్‌ విభాగం బాలికల్లో జి.మేధా, జి.ప్రవల్లిక, ఎ.కీర్తన, బాలురులో సీహెచ్‌ దైవిక, ఎస్‌.తేజ, జి.చోటు, జూనియర్స్‌ బాలుర విభాగంలో ఎ.సాయిసంతోష్‌, ఇ.ఆవాస్‌, ఎస్‌.శ్రీవాత్సవ, బాలికల విభాగంలో ఎన్‌.శృతి, ఎస్‌. అను, పి.జాస్మిన్‌ విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఆర్‌ఎంసీ పీడీ డాక్టర్‌ కె.స్పర్జన్‌రాజు, అథ్లెటిక్స్‌ సంఘ కార్యదర్శి రంగారావు, సంఘ కార్యదర్శి సౌదామణి, నిర్వహణా కార్యదర్శి గోవిందరాజు, కోశాధికారి గోపి, శ్రీనివాస్‌, సుధాకర్‌, నాగలక్ష్మి, రామకృష్ణ, లాన్‌ టెన్నిస్‌ సంఘ రాష్ట్ర కార్యదర్శి రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T06:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising