ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి పాల్పడి విచారణ ఎదుర్కొంటున్న కార్యదర్శులు

ABN, First Publish Date - 2020-09-28T11:36:15+05:30

అవినీతికి పాల్పడి గ్రామాల్లో బదిలీ అయిన తర్వాత తాము తప్పించుకోవచ్చులే అని ధీమా వ్యక్తం చేసే ఏ ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12మందిపై విచారణ


రాజమహేంద్రవరం రూరల్‌, సెప్టెంబరు 27: అవినీతికి పాల్పడి గ్రామాల్లో బదిలీ అయిన తర్వాత తాము తప్పించుకోవచ్చులే అని ధీమా వ్యక్తం చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం నుంచి రిటైరయినా... లేకుంటే మరణించినా వారిపై కూడా ఆరోపణలు ఉంటే అటువంటి వారిపై విచారణ జరుగుతూనే ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ సంఘటన. గతంలో అనధికార లే-అవుట్‌లు, నిభందనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు చేపడుతుంటే తమది కాదన్నట్లు వ్యవహరిస్తూ కొంతమంది పంచాయతీ కార్యదర్శులు తమ జేబులు నింపుకొని కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనానికి గండి కొట్టారు. వీటిపైౖ విచారణ చేపట్టిన విజిలెన్ప్‌ అధికారులు నిగ్గుతీశారు. 


ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులు

ఈ కోవలో రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో పిడింగొయ్యి, కాకినాడ రూరల్‌ మండలంలో రమణయ్యపేట, అనపర్తి మండలంలో అనపర్తి ఉన్నాయి. విజిలెన్స్‌ నివేదిక నెంబరు 24(సీ నెం. 2943/వీఈ డీ2/2013) తేదీ 20-10-2014 నివేదిక ప్రకారం రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధిలో పిడింగొయ్యి పంచాయతీలో ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేసిన జి.వెంకట్రావు అదనపు ఇన్చార్జి కార్యదర్శి ఎస్‌.రామారావు, అడ్వర్డ్‌బెన్‌హెర్‌లకు, బొమ్మూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన డి.విజయరాజు, మేడపాటి బాబు, హుకుంపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన డి.రామశ్రీనివాస్‌లకు, అనపర్తి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎ.ప్రభాకరరెడ్డి, ఎం.శివపార్వతి, బి.రత్నం పి.పాండురంగారావులకు, కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన పి.పాండురంగారావు, సీహెచ్‌ జగ్గారావులపై విచారణ చేపట్టాలని, ఈనెల 25న ప్రభుత్వ్త ప్రిన్సిపల్‌ శక్రటరీ గోపాలకృష్ణద్వివేది ఉత్తర్వులను జారీ చేశారు.


ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న నేపథ్యంలో పైన ఉదహరించిన 12మంది కార్యదర్శులపై చార్జీమెమోలు జారీచేశారు. విచారణ చేపట్టి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (క్లాసిఫికేషన్‌, కంట్రోల్‌) రూల్‌నంబర్‌ 20(2) ప్రకారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తిని విచారణ అధికారిగాను, రూల్‌ నంబర్‌ 20(5సీ) ప్రకారం కాకినాడ డీఎల్‌పీవో అమ్మాజీని ప్రీసైడింగ్‌ అధికారిగాను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T11:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising