ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలు ప్రారంభం.. హాజరు నామమాత్రం

ABN, First Publish Date - 2020-11-03T06:50:03+05:30

కొవిడ్‌ అనంతరం సోమవారం తొమ్మిది, పదో తరగతుల పాఠశాలలు తెరిచారు.

రావులపాలెంలో విద్యార్థులకు కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, నవంబరు 2: కొవిడ్‌ అనంతరం సోమవారం తొమ్మిది, పదో తరగతుల పాఠశాలలు తెరిచారు. అయితే విద్యార్థుల హాజరు శాతం అంతంతమాత్రంగా ఉంది. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపడం లేదు. మాస్కులు అందించి, తరగతి గదులను పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేస్తేనే పిల్లలను పంపిస్తామని కొందరు, కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే పిల్లలను పంపిస్తామని మరికొందరు అంటున్నారు. మండలంలో పది ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది తరగతి విద్యార్థులు 584మందికి 65 మంది, పదిలో 621మందికి 184మంది హాజరయ్యారు.
కపిలేశ్వరపురంలో 23శాతం హాజరు
కపిలేశ్వరపురం: మండలంలో 979మంది విద్యార్థులకు 23శాతంమంది హాజరైనట్టు ఎంఈవో కె.తాతారావ ుతెలిపారు. ఒక్కో తరగతి గదిలో 16మంది విద్యార్థులు మించకుం డా ఆరు అడుగుల భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల సంఖ్య 750కు మించితే మూడు విభాగాలుగా చేసి మూడు రోజులకొకసారి హాజరయ్యేలా నిర్వహిస్తామని ఎంఈవో చెప్పారు.
  కరోనాపై అవగాహన
రావులపాలెం రూరల్‌:  విద్యార్థులు కరోనాపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని ఎంఈవో హరిప్రసాద్‌ అన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. మొత్తం 304మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పీహెచ్‌సీ సిబ్బంది, ఉపాధ్యాయులు కరోనాపై అవగాహన కల్పించారు.
 

Updated Date - 2020-11-03T06:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising