ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అక్రమాల జోరు

ABN, First Publish Date - 2020-12-02T06:28:37+05:30

ముమ్మిడివరం, డిసెంబరు 1: ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ఠా ణేలంక, గేదెల్లంక ర్యాంపుల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక ను అక్రమంగా రవాణా

పడవల నుంచి ఇసుక ఎగుమతి చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలింపు

ముమ్మిడివరం, డిసెంబరు 1: ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ఠా ణేలంక, గేదెల్లంక ర్యాంపుల నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లంకాఫ్‌ ఠాణేలంక, గురజాపులంక నదీపాయల నుంచి సేకరించిన ఇసుకను లంకాఫ్‌ ఠాణేలంకకు చేర్చి అక్కడి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకు ఇసుకను సరఫరా చేసేందుకు ఈ ర్యాంపు ఏర్పాటు చేశారు. అయితే వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవాలంటే ఈ ర్యాంపు ఎక్కడా కనిపించడం లేదు. ఈ ర్యాంపు నుంచి మాత్రం రోజూ అధిక సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు తరలిపోతున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో ట్రాక్టర్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకున్నవారికి ఈ ర్యాంపు నుంచి తక్కువ సంఖ్యలో సరఫరా అవుతున్నాయి. మైన్స్‌ అధికారుల లెక్క ప్రకారం రోజుకి ఐదారు ట్రాక్టర్లలోపే ఇసుక సరఫరా అవుతున్నట్టు చూపి ఒకే డీడీపై పెద్దఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుక (నాలుగున్నర టన్నులు)ను బ్లాక్‌లో రూ.4వేల నుంచి రూ.4,500 వరకు విక్రయి స్తున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ర్యాంపుల నిర్వహణ సాగుతోంది.

Updated Date - 2020-12-02T06:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising