ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా ద్వారా రూ.93.3 కోట్ల లబ్ధి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-10-28T06:43:08+05:30

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు27: జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండవ విడత సాయం ద్వారా 4,55,022 రైతులకు రూ.93.3 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్సీ పండుల, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు27: జిల్లాలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండవ విడత సాయం ద్వారా 4,55,022 రైతులకు రూ.93.3 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన రైతు భరోసా, పీఎం కిసాన్‌ రెండో విడత సాయం పంపిణీ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ హాల్‌ నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 2019-20లో రూ.311.52 కోట్లు, ఈ ఏడాది మేలో తొలి విడత రూ.322.25 కోట్లు, ప్రస్తుతం రెండో విడత రూ.93.30 కోట్లు కలిపి రూ.727.07 కోట్లు రైతులకు అందించ డం జరిగిందన్నారు. గత మూడు నెలల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల 11,115.73 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు నష్టపోయిన 23,171 మంది రైతులకు రూ.16.597 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ జమ చేశామన్నారు. జేసీ జి లక్ష్మీశ, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, వ్యవసాయ శాఖ జేడీ కేవీఎస్‌ ప్రసాద్‌, ఉద్యానవన శాఖ డీడీ రామ్మోహనరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T06:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising