ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన

ABN, First Publish Date - 2020-09-28T11:41:44+05:30

సీఎం జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పాలన సాగిస్తోందని రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గంపేట, సెప్టెంబరు 27: సీఎం జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పాలన సాగిస్తోందని రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. జగ్గంపేటలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. జగ్గంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు ధర్మాన కృష్ణదాసు, కన్నబాబు, వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి బోసు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరయ్యారు. కృష్ణదాసు మాట్లాడుతూ రెవెన్యూశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్టు చెప్పారు.


చంద్రబాబునాయుడు చేస్తున్న కుయుక్తులను తిప్పికొడుతూ తమ నాయకుడు ప్రజలకు అవసరమైన సంక్షేమ, మౌలిక వసతులను సమకూర్చుకుంటూ వెళుతున్నారన్నారు. రాష్ట్రంలో మతాల పేరిట చిచ్చు లేపాలని ప్రయత్నాలు చేస్తున్న పార్టీలను ప్రజలు చూస్తున్నారని, విగ్రహాలు, ఆలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. దీనిపై రాష్ట్రం మొత్తంమీద నిఘా బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. అనంతరం జలకళ పోస్టరును ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు, తోట త్రిమూర్తులు, స్థానిక నాయకులు ఒమ్మి రఘురామ్‌, అట్లూరి నాగబాబు, జనపరెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-28T11:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising