అంగన్‌వాడీ కేంద్రాలకు స్థల కేటాయింపులపై సమీక్ష
ABN, First Publish Date - 2020-10-01T07:22:00+05:30
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిం చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున స్థలాలు కేటాయించాలని ఐసీ డీఎస్ సామర్లకోట అర్బన్,
సామర్లకోట, సెప్టెంబరు 30: అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిం చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున స్థలాలు కేటాయించాలని ఐసీ డీఎస్ సామర్లకోట అర్బన్, రూరల్ సీడీపీవోలు పంతం సావిత్రి, జి.ఉషారాణి కోరారు.
బుధవారం వారు తహశీల్దార్ వజ్రపు జితేంద్ర, డిప్యూటీ తహశీల్దార్ ఆర్.శ్రీనివాస్, సూపర్‌వైజర్లు, వీఆర్వోలతో సమీక్షించారు. తహశీల్దార్ మాట్లాడుతూ స్థల పరిశీలనకు వీఆర్వోలను నియమిస్తామని.. ప్రభుత్వ, మునిసిపల్ ఖాళీ స్థలాలను గుర్తించిన తర్వా త నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2020-10-01T07:22:00+05:30 IST