ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకితభావంతో పనిచేసే అధికారులకే ప్రజల్లో గుర్తింపు

ABN, First Publish Date - 2020-10-01T07:17:21+05:30

విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసే అధికారుల సేవలను ప్రజలు తమ మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని ఏలేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ వట్టిగడ్డ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, సెప్టెంబరు 30: విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసే అధికారుల సేవలను ప్రజలు తమ మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని ఏలేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ వట్టిగడ్డ సబ్‌డివిజన్‌ డీఈ టి.జయరాజ్‌, ఏఈ పి.గోపీకృష్ణ అన్నారు. ఇరిగేషన్‌ డిపార్టెమెంట్‌లో 33ఏళ్లుగా ఏలేరు ఇరిగేషన్‌ సెక్షన్‌(ఏలేశ్వరం)లో గ్రేడ్‌-3 వర్క్‌ ఇన్‌స్పెక్టరుగా సేవలందించిన వూర రాజబాబు ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం ఘన సన్మానం నిర్వహించారు.


ఇరిగేషన్‌ డీఈ, ఏఈలు జయరాజ్‌, గోపీకృష్ణ అఽధ్యక్షతన స్థానిక వెంకటేశ్వరా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఏలేరు, వట్టిగడ్డ ఇరిగేషన్‌ శాఖల అధికారులు, లయన్స్‌క్లబ్‌ ఆప్‌ ఏలేశ్వరం బనానాల్యాండు కార్యవర్గ ప్రతినిధులు, ప్రముఖులు ఉద్యోగ విరమణ చేసిన రాజబాబు, నాగలక్ష్మి దంపతులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.


కార్యక్రమంలో జగ్గంపేట ఏఈ సత్యనారాయణ, జ్యోతుల నాగసత్యశ్రీనివాస్‌, కోట శ్రీనివాసచక్రవర్తి, అలమండ వెంకటదుర్గాప్రసాద్‌, వూర శ్రీను, సామంతుల వెంకటేశ్వరరావు, చిక్కాల లక్ష్మణరావు, తూమురౌతు గుర్రయ్య తదితర అధికారులు, లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising