ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిపోతున్న వైసీపీ దౌర్జన్యాలు

ABN, First Publish Date - 2020-12-30T05:41:49+05:30

గంగవరం, డిసెంబరు 29: రంపచోడవరం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 22న జడేరు జంక్షన్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల

గంగవరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

గంగవరం, డిసెంబరు 29: రంపచోడవరం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 22న జడేరు జంక్షన్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చింపివేశారని, ఈ సంఘటనలో మహిళా నాయకులు, గిరిజనులను కులంపేరుతో దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై అదేరోజు రాత్రి గంగవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, నేటికీ వైసీపీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ డాక్టర్‌ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ బుల్లియ్యమ్మ, టీడీపీ నాయకులు పాము అర్జున, కనిగిరి రాంబాబు, బద్రి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising