ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిప్పురవ్వలు ఎగసి మూడు తాటాకిళ్లు దగ్ధం

ABN, First Publish Date - 2020-03-08T09:20:01+05:30

బండారులంక శివారు మట్టపర్తివారిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధం కాగా ఏడు కుటుంబాల వారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.8లక్షల ఆస్తి నష్టం


అమలాపురం రూరల్‌, మార్చి 7: బండారులంక శివారు మట్టపర్తివారిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధం కాగా ఏడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. రూ.8లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు అమలాపురం అగ్నిమాపక అధికారి వైవీ.జానకిరామ్‌ శనివారం తెలిపారు. స్థానిక మట్టపర్తివారిపాలెంలో పొయ్యి నుంచి లేచిన నిప్పు రవ్వల కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్దపెద్ద పోర్షన్లు ఉన్న రెండు తాటాకిళ్లు సహా మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గుత్తుల గణేశ్వరరావు, గుత్తుల నాగమోహనరావు, గుత్తుల హరిబాబు, గుత్తుల శ్రీనివాసరావు, గుత్తుల సత్యవతి, బొంతు సత్యనారాయణ, మామిడిశెట్టి అమృతనాగభూషణం కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి.


అర్ధరాత్రి సమయం కావడంతో గృహాల నుంచి ఏ ఒక్క వస్తువులు తీసుకోలేకపోయామని బాధితులు బోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితులను మండల రెవెన్యూ ఇనస్పెక్టర్‌ గెద్దాడ ఉమాశంకర్‌, ఏఆర్‌ఐ రమణ, వీఆర్వో నవుండ్రు జయరాజు పరామర్శించి వివరాలను సేకరించారు.

Updated Date - 2020-03-08T09:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising