నిర్దిష్టకాలంలో పౌరసేవలు అందించాలి: జడ్పీ సీఈవో
ABN, First Publish Date - 2020-11-03T06:19:11+05:30
ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన వినతులను నిర్దిష్టమైన కాలంలో పరిష్కరించాలని జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ చెప్పారు.
సర్పవరం జంక్షన్, నవంబరు 2: ప్రజలకు మెరుగైన పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన వినతులను నిర్దిష్టమైన కాలంలో పరిష్కరించాలని జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ చెప్పారు. కాకినాడ రూరల్ సర్పవరంలో సచివాలయం-4ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం సచివాలయ ఆవరణలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చెందిన వివరాల ప్రదర్శనను పరిశీలించారు. ఎంపీడీవో పి.నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T06:19:11+05:30 IST