సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా
ABN, First Publish Date - 2020-12-11T06:49:41+05:30
పట్టణంలోని 2,3,4 వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా వార్డుల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిఠాపురం మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
పిఠాపురం, డిసెంబరు 10: పట్టణంలోని 2,3,4 వార్డుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా వార్డుల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిఠాపురం మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 3వ వార్డులో ప్రధాన డ్రెయినేజీ నుంచి వెళ్లే మురుగునీరు బయటకు పోయే మార్గాలను లేఅవుట్ల పేరుతో మూసివేశారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. తక్షణం మురుగునీరు వెళ్లేలా డ్రెయినేజీ నిర్మించాలని, పశువుల సంత నుంచి రామా థియేటర్ సెంటర్ వరకు సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు వార్డు నుంచి ప్రదర్శనగా తరలివచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్ కమిషనరు రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో అభివృద్ధి కమిటీ కన్వీనర్ కరణం విశ్వనాథం, మారోజు వీరబాబు, జి.వీరబాబు, బండి కృష్ణమూర్తి, దొడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:49:41+05:30 IST