ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం’ ఖర్చు కేంద్రమే భరించాలి’

ABN, First Publish Date - 2020-10-25T06:42:41+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం రూ.55,548 కోట్లు కేంద్రమే భరించాలని, లేని పక్షంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని వదులుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం రూ.55,548 కోట్లు కేంద్రమే భరించాలని, లేని పక్షంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని వదులుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 100 శాతం కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి షెకావత్‌ రాతపూర్వకంగా తెలిపారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లు భరించడానికే అంగీకరించడం జలశక్తిశాఖ అంచనాలపై అనుమానం వ్యక్తం చేసినట్లవుతుందని ఆయన అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మడం లేకపోవడమే దీనికి కారణమన్నారు. 2004లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులకు 16 ఏళ్లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు రూ.16 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేసినట్టు చెబుతున్నారని, అయితే ఇప్పటికి 16 గ్రామాలు మాత్రమే ఖాళీ చేయించారన్నారు. 276 గ్రామాల్లో 6 శాతం గ్రామాలు మాత్రమే పునరావాస కాలనీలకు తరలించారన్నారు. మిగిలిన 94 శాతం తరలించాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని అన్నారు.  ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని సూర్యనారాయణ కోరారు. లేని పక్షంలో జలశక్తిశాఖ ఆమోదించిన నిధులను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-10-25T06:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising