ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులకుమెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ABN, First Publish Date - 2020-02-08T08:08:21+05:30

ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌


భానుగుడి (కాకినాడ), ఫిబ్రవరి 7: ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీఎస్‌ ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారులకు సూచించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కాంప్లెక్స్‌లో బాత్రూమ్‌లు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, కార్మికులు సమస్యలు, ఆర్టీసీ పరిసరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.


ప్రతిఒక్కరూ కాంప్లెక్స్‌ను  పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్నా రు. ప్రభుత్వ రాయితీలు, ఇన్సూరెన్స్‌లు, ఈసీఐ వంటివాటిపై చర్చించారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్‌ పథకానికి ప్రతిఒక్కరూఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈసీఐకు రూ.100 చొప్పున చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటివరకు బస్‌పాస్‌లు లేవని, వీటిపై తక్షణం విజయవాడ వెళ్లి జీవో జారీ చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ వెంకట్రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం ఆర్‌వీఎస్‌ నాగేశ్వరరావు, ఎన్‌.వరప్రసాద్‌, డిపో మేనేజర్‌ పి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


సాధారణ ప్రయాణికుడిలా..

రాజమహేంద్రవరం అర్బన్‌: ఆర్డీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ సాధారణ ప్రయాణికుడిలా పల్లెవెలుగు బస్సులో వెళ్లారు. శుక్రవారం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వయా ద్వారపూడి మీదుగా వస్తున్న సర్వీసు నెంబరు 3776 పల్లెవెలుగు బస్సులో ఆయన రాజమహేంద్రవరం వరకూ ప్రయాణించారు. సామర్లకోటలో సాయంత్రం 5.30 గంటల సమయంలో బస్సెక్కిన ఆయన రెండున్నర గంటలపాటు బస్సులోనే ఉన్నారు. విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యాలకు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. ఎండీతో పాటు అధికారులు కూడా బస్సులో ప్రయాణించారు.

Updated Date - 2020-02-08T08:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising