ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం పరిశీలన

ABN, First Publish Date - 2020-12-17T05:42:07+05:30

పురుషోత్తపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని బుఽధవారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందంలోని జాయింట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పరిశీలకులు పి.రాజేందర్‌ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పి.జగన్నాథరావు బృందం పరిశీలించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎత్తిపోతల పథకం పరిశీలిస్తున్న ఎన్‌జీటి బృందం 

సీతానగరం, డిసెంబరు 16 : పురుషోత్తపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని బుఽధవారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందంలోని జాయింట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పరిశీలకులు పి.రాజేందర్‌ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పి.జగన్నాథరావు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రాజేంద్రరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం నిర్మించారని, ఈ నిర్మాణం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టంపై పరిశీలిస్తున్నామన్నారు. మొత్తం స్కీంను అన్ని విధాలా పరిశీలించామని నివేదికను ట్రిబ్యునల్‌కు అందిస్తామని తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయి ఇంతవరకు నష్టపరిహారం అందని రైతులు కొండు రమేష్‌ తదితరులు తమ  గోడును కమిటీ ముందు చెప్పుకున్నారు. అందరికీ సమానంగా నష్టపరిహారం ఇవ్వలేదని కొన్నిచోట్ల ఎకరాకు రూ.52 లక్షలు ఇవ్వగా, ఇక్కడ రూ.28 లక్షలు ముందుగా స్వాధీనం చేసిన వారికి అనే పదంతో ఇచ్చారని ఇవ్వని వారి  భూములు స్వాధీనం చేసుకున్నా రూ.19 లక్షలు మాత్రం ఇస్తామంటున్నారని కమిటీ ముందు విచారం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే న్యాయస్థానంలో విషయం ఉన్నందున  ఏమీ చెప్పలేమన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, సబ్‌ కలెక్టర్‌ అనుపమాంజలి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ డీఎస్‌ఎస్‌ యాదవ్‌, ఈఈ గంగయ్య, తహశీల్దార్‌ శివమ్మ, ఏడీఏ మల్లికార్జునరావు, ప్రాజెక్టు మేనేజర్‌ మురళీకృష్ణ, ఏవో సూర్యరమేష్‌ పాల్గొన్నారు

Updated Date - 2020-12-17T05:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising