ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెహ్రూ వేదిక వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-12-30T07:28:28+05:30

నగరంలోని బాలాజీచెరువు సెంటర్‌లో కూల్చివేసిన నెహ్రూ వేదిక ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

కొండబాబును అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండబాబు పోలీసుల మధ్య వాగ్వాదం   

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు29: నగరంలోని బాలాజీచెరువు సెంటర్‌లో కూల్చివేసిన నెహ్రూ వేదిక ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాకినాడ డీఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసులు వేదిక ప్రదేశం వద్ద టీడీపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు. దీంతో వనమాడి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు ఉందని మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా ప్రశ్నించగా వారిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించి వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ తీరును నిలదీసిన కొండబాబును పోలీసులు అడ్డుకోవ డంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరం లో అధికారుల పాలన జరగడం లేదని, రౌడీలు, గూండాల చేతుల్లో పరిపాలన జరుగుతోందన్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న నె హ్రూ వేదికను ఇటీవల ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అనుచరులు తమ స్వలాభం కోసం రాత్రికి రాత్రి కూల్చి వేసి నెహ్రూ విగ్రహాన్ని కూల్చివేసి వివేకానంద పార్కులో పడవేయడం జరిగిందన్నారు. నెహ్రూ వేదికను పునర్నిర్మాణం జరిగేంత వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో చింతపల్లి కాశి, జోగా రాజు, పలివెల రవి, వనమాడి ఉమాశంకర్‌, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, ఎండీ అజ్జు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-30T07:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising