ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.30 కోట్లతో సడక్‌ రోడ్లు నిర్మించండి

ABN, First Publish Date - 2020-12-05T06:20:22+05:30

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో గ్రామీణ సడక్‌ యోజన కింద అత్యవసరంగా రహదారులను నిర్మించాలని ఎంపీ భరత్‌రామ్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి తోమార్‌కు ఎంిపీ భరత్‌ అభ్యర్ధన


రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 4 : రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో గ్రామీణ సడక్‌ యోజన కింద అత్యవసరంగా రహదారులను నిర్మించాలని ఎంపీ భరత్‌రామ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో  శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ను కలిసి రూ.30 కోట్లతో రహదారులు నిర్మించాలని అభ్యర్థించారు. తన నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉందని గతంలో విడివిడిగా రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ భేటీలో తన నియోజకవర్గంలో ఏడు చొప్పున రహదారుల నిర్మాణానికి ఆమోదం పొందాయని ఎంపీ తెలిపారు. వాటిలో రాజానగరం, రాజమహేంద్రవరంరూరల్‌, అనపర్తి, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  మొత్తం 75.51 కిలో మీటర్ల మేర రూ.30.65 కోట్లు విలువగల పనులు చేపట్టాల్సి ఉందన్నారు.  పశ్చిమగోదావరిలో గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలలో గతంలో అనుమతులు మంజూరైన ఏడు రోడ్లు కాకుండా మరికొన్ని రహదారులు నిర్మాణం తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందనే విషయాలను, అదే జిల్లాలో 185.60 కిలో మీటర్ల నిడివి కల్గిన రహదార్ల నిర్మాణాలకు అనుమతులు ఇప్పించాలని మంత్రి తోమార్‌ను ఎంపీభరత్‌ కోరారు. 

ఫ సీఎం జగన్‌ చలువతోనే ఈ భాగ్యం

సీఎం జగన్‌ చలువతోనే రాజమహేంద్రవరం ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం ఈ భాగ్యం తనకు కలిగాయని కేంద్రమంత్రి తోమార్‌తో  భరత్‌ రామ్‌ అన్నారు. సీఎం జగన్‌ తనపై పెట్టిన బాధ్యత సమర్ధవంతంగా నిర్విర్తిస్తున్నానని ఎంపీ కేంద్ర మంత్రితో అన్నారు.



Updated Date - 2020-12-05T06:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising