ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ కావాలి..!

ABN, First Publish Date - 2020-02-23T06:40:37+05:30

ఆ చిన్నారికి అమ్మే లోకం. అప్పటివరకు ఇంటివద్దే తనను చూసుకునే అమ్మ రెండు, మూడురోజులగా తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవలల ప్రసవంతో ఆస్పత్రిలో తల్లి

నాలుగురోజులుగా కనిపించక బాలుడికి బెంగ


కూనవరం, ఫిబ్రవరి 22: ఆ చిన్నారికి అమ్మే లోకం. అప్పటివరకు ఇంటివద్దే తనను చూసుకునే అమ్మ రెండు, మూడురోజులగా తన దగ్గరలేదు. దీంతో ఆమె మీద బెంగ పెట్టుకున్నాడు.ఈ కొండరెడ్డి బాలుడి పేరు బాబురావు రెడ్డి. ఇతడి తల్లి పేరు చదల చెల్లెమ్మ. గబ్బిలాలగొందికి చెందిన ఆమె చింతూరు ఆస్పత్రిలో పదోకాన్పులో కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఆ ప్రాంతంలో శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగిన మొదటి మహిళ ఈమె. నాలుగురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. ఏడేళ్లుగా ఎప్పుడూ తన దగ్గరే ఉండే తల్లి తనకు కనిపించకపోయేసరికి ఆ చిన్నారి తల్లడిల్లాడు. ఆమె మీద బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నాడు. అమ్మ వస్తుందని తండ్రి సర్దిచెప్పినా బాలుడికి మాత్రం బెంగ తీరలేదు. చివరకు వైద్యసిబ్బంది గుట్టలెక్కి వచ్చి అతడికి వైద్యపరీక్షలు చేశారు. కాగా చెల్లెమ్మకు పదో కాన్పులో కవలలు జన్మించగా అంతకుముందు తొమ్మిదిమంది సంతానం ఉన్నారు. వీరిలో ఆరోగ్య కారణాలతో ముగ్గురు మరణించగా ఇప్పుడు కవలలతో కలిపి మొత్తం 8మంది పిల్లలయ్యారు.

Updated Date - 2020-02-23T06:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising