ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లవరంలో తాగునీటి సమస్య తీరుస్తా

ABN, First Publish Date - 2020-12-28T05:25:56+05:30

అల్లవరం, డిసెంబరు 27: అల్లవరం మండలంలో రూ.5 కోట్ల ఓఎన్జీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో మంచినీటి ట్యాంకులు నిర్మించి తాగునీటి సమస్య తీరుస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. అల్లవరం మండలం కోడూరుపాడులో రూ.223 లక్షలతో నిర్మించే

కోడూరుపాడులో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్న విశ్వరూప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పినిపే విశ్వరూప్‌

అల్లవరం, డిసెంబరు 27: అల్లవరం మండలంలో రూ.5 కోట్ల ఓఎన్జీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో మంచినీటి ట్యాంకులు నిర్మించి తాగునీటి సమస్య తీరుస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. అల్లవరం మండలం కోడూరుపాడులో రూ.223 లక్షలతో నిర్మించే 124 ఇళ్ల నిర్మాణాలకు ఆయన ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లవరం మండలంలో రూ.20కోట్లతో 56 ఎకరాల భూమి కొనుగోలు చేసి 2,257 మందికి ఇళ్ల పట్టాలుగా ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు సీఎం జగన్‌ పేదలకు ఇళ్లు ఇస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం డ్వాక్రా రుణాలు రద్దు చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో 32లక్షల మంది పేదలకు సీఎం ఇళ్లు నిర్మించి ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మంత్రిని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు కొనుకు బాపూజీ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తుట్టెపు బాబి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి వెంకట్రామరాజు, యల్లమిల్లి బోస్‌, పినిపే శ్రీకాంత్‌, సాధనాల వెంకట్రావు, బొమ్మి ఇజ్రాయిల్‌, గుబ్బల రంగనాథస్వామి, ఎన్‌సుదర్శనరావు, పరమట శ్రీను, మెరికల శ్రీను, నాతి శ్రీనివాస్‌, జల్లి శ్రీనివాసరావు, దాసం రాంబాబు, హౌసింగ్‌ డీఈఈ డి.నాగలక్ష్మి, ఏఈ ప్రసాదరాజు, మండల వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జి ఎండీవో ప్రభాకర్‌ పాల్గొన్నారు. ముందుగా వైసీపీ నాయకుడు గెడ్డం జీవన్‌కుమార్‌ మృతి పట్ల మంత్రి విశ్వరూ్‌పతో పాటు సభికులు మౌనం పాటించి ప్రగాఢ సంతాపం తెలిపారు. 

నీటి సమస్య పరిష్కరించండి

కోడూరుపాడులో కొంతకాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి పినిపే విశ్వరూ్‌పకు గ్రామస్థులు మొర పెట్టుకున్నారు. ఇళ్ల శంకుస్థాపనకు వెళుతున్న మంత్రిని వారు ఆపి తాగునీటి సమస్యపై వినతిపత్రం అందచేశారు. బోడసకుర్రు ప్రాజెక్టు నుంచి మురికినీరు వస్తుందని, గ్రామంలో 60వేల లీటర్ల వాటర్‌ ట్యాంకు పరిణామం సరిపోవడంలేదన్నారు. అనధికార కుళాయిల వల్ల సమస్య ఏర్పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు, పిల్లా ప్రసాద్‌ మంత్రికి తెలిపారు. మరో వాటర్‌ ట్యాంకు నిర్మించి సమస్య పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-28T05:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising