ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణంలో చోరీ

ABN, First Publish Date - 2020-10-07T08:20:42+05:30

కాకినాడ ఎల్‌బీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడి సుమారు రూ.2,66,650 నగదు, రెండు మద్యం ఫుట్‌ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.2.66 లక్షల నగదు,

రెండు ఫుల్‌ బాటిళ్ల అపహరణ


సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 6: కాకినాడ ఎల్‌బీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడి సుమారు రూ.2,66,650 నగదు, రెండు మద్యం ఫుట్‌ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు సర్పవరం సీఐ ఆర్‌. గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడియల్‌ కాలేజీ కెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణానికి మంగళవారం రాత్రి  సూపర్‌వైజర్‌, సిబ్బంది తా ళాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం సిబ్బంది వచ్చి పరిశీలించగా షాపు  ఇనుప షట్టర్లు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. మద్యం దుకాణం వెనుక భాగాన ఏర్పాటు చేసిన రేకు తలుపు తాళాలు బద్ధలు కొట్టి తలుపు తీసి ఉండటంతో సూపర్‌వైజర్‌, సిబ్బంది మద్యం దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. అయితే నగదు, రెండు మద్యం బాటిల్స్‌  కని పించలేదు. దీంతో సూపర్‌వైజర్‌ కొర్రా మణికంఠ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణబాబు తెలిపారు. 

Updated Date - 2020-10-07T08:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising