ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం ప్రియులకు ఊరట

ABN, First Publish Date - 2020-10-30T06:29:54+05:30

ఎట్టకేలకు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గాయి. మందుబాబులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. మద్యం తాగడం మానిపించడం కోసం ధరలు విపరీతంగా పెంచినట్టు చెప్పిన ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తగ్గిన మద్యం ధరలు 

క్వార్టర్‌ బాటిల్‌కు  రూ.50 నుంచి 150 వరకూ తగ్గింపు

ఫుల్‌పై రూ.400 నుంచి 1000 వరకూ తగ్గింపు

జీవోను జారీ చేసిన   ప్రభుత్వం

మరి బ్రాండ్లు ఎప్పుడొస్తాయో

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎట్టకేలకు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గాయి. మందుబాబులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. మద్యం తాగడం మానిపించడం కోసం ధరలు విపరీతంగా పెంచినట్టు చెప్పిన ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పుడు  ఆదాయం పడిపోవడం వల్లో, ఇతర రాషా్ట్రల నుంచి భారీగా సరుకు వచ్చి ప్రభుత్వ గండికొడుతుండడడం వల్లో గాని ఆకస్మికంగా ధరలు తగ్గించింది. గతంలో పెంచిన ధరలు మొత్తాన్ని తగ్గించలేదు. ఇప్పుడున్న ధరల్లో కొంతమేర తగ్గించింది. ఈమేరకు 312వ జీవోను గురువారం జారీ చేసింది. జిల్లాలో నెలకు రూ.170 కోట్ల నుంచి 180 కోట్ల వరకూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో చీప్‌ లిక్కర్‌ ధరలు కొద్దిగా తగ్గించింది. అయినా సేల్స్‌ పెరగడంలేదని గమనించి, తాజాగా మీడియం, ప్రీమి యం బ్రాండ్ల ధరలు తగ్గించారు. క్వార్టర్‌ బాటిల్‌కు రూ.50 నుంచి 130కు తగ్గించారు. ఫుల్‌ బాటిల్‌పైరూ.400 నుంచి 1000 వరకూ తగ్గించారు. దీనివల్ల  అమ్మకాలు పెరుగుతాయా, లేదా మందుబాబులు తాగడం తగ్గించారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. మద్యం ధరలు తగ్గించడం వల్ల నాటుసారా ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ ధరలు తగ్గించానికి పలు కారణాలను ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ, కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండడం వల్ల  స్మగ్లింగ్‌ పెరిగిందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ స్మగ్లింగ్‌ వల్ల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ధరలు పెంచడం వల్ల 40 శాతం అమ్మకాలు పడిపోయినట్టు కూడా  తెలిపింది.దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ధరలు తగ్గించింది. దీంతో బార్లలో అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గించడంతోపాటు పాత బ్రాండ్లను కూడా అనుమతిస్తే మద్యంప్రియులు ఇష్టపడతారు. ధర తగ్గించడం వల్ల అమ్మకాలు పెరగవని, మంచి బ్రాండ్లు అందుబాటులో ఉంటేనే అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

Updated Date - 2020-10-30T06:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising