ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కార్తీక దీపోత్సవం

ABN, First Publish Date - 2020-11-30T06:57:03+05:30

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆది వారం భక్తులు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిలింగాలఘాట్‌లో సాయంత్రం పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు, ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వ హించారు.

గోదావరి నదికి హారతిస్తున్న ఎంపీ భరత దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 29:  కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆది వారం భక్తులు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిలింగాలఘాట్‌లో సాయంత్రం పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు, ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వ హించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ దంపతులు పాల్గొని గోదావరి నదికి హారతిచ్చి దీపోత్సవం ప్రారంభించారు. కార్యక్రమం చేపట్టిన పం తం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌, పంతం కొండలరావును ఎంపీ అభి నందించారు. దీపోత్సవం 2014 నుంచి ఏటా చేస్తున్నామని కొండలరావు చెప్పారు. కార్య క్రమంలో కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేడపాటి షర్మిళారెడ్డి, పోలు విజయలక్ష్మి, ట్రస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు.


  • సత్యదేవుడి సన్నిధిలో జ్వాలాతోరణం


అన్నవరం, నవంబరు 29: రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో ఆదివారం రాత్రి జ్వాలాతో రణం వైభవోపేతంగా జరిగింది. ప్రధానాలయం నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకిలో తూర్పు రాజగోపురం వద్దకు తోడ్కొనివచ్చి ప్రధానార్చ కుడు కొండవీటి సత్యనారాయణ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం నిర్వహిం చారు. అనంతరం ఎండుగడ్డితో తయారుచేసిన తోరణాన్ని ఏర్పాటుచేసి పండితులు జ్వలింప చేశారు.  స్వామి, అమ్మవార్లను తోరణం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. ఏఈవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్లు లక్ష్మణస్వామి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకి నాడ, పిఠాపురం, ద్రాక్షారామ తదితర ప్రాంతా ల్లో కార్తీక పౌర్ణమి దీపోత్సవం నిర్వహించారు. జ్వాలాతోరణం వెలిగించారు. 

Updated Date - 2020-11-30T06:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising