నమ్మించి మోసం చేశాడు
ABN, First Publish Date - 2020-12-29T06:38:55+05:30
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తితోనే తనకు వివాహం జరిపించాలంటూ ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన చెన్నాడ పావని సోమవారం ఆందోళనకు దిగింది.
- అతడితోనే పెళ్లి జరిపించాలని లింగంపర్తిలో వివాహిత దీక్ష
ఏలేశ్వరం, డిసెంబరు 28: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తితోనే తనకు వివాహం జరిపించాలంటూ ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన చెన్నాడ పావని సోమవారం ఆందోళనకు దిగింది. గ్రామంలోని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టింది. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు. బాధితు రాలు మాట్లాడుతూ గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రేమిస్తున్నానంటూ కొన్నేళ్ల నుంచి తన వెంటపడేవాడని, అయితే తల్లిదండ్రులు తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారని చెప్పింది. అయినప్పటికీ భర్తను వదిలి వచ్చే యాలని, పెళ్లి చేసుకుంటాని రామకృష్ణ నమ్మించాడని, భర్త నుంచి వేరుచేసి పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తూ న్యాయవాది సమక్షంలో బాండ్ పేపర్‌పై అఫిడవిట్ రాశాడని పేర్కొంది. మూడు నెలలు కాపురం చేసి ఇప్పుడు వివాహం చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడంది. అటు భర్తతో కాపురం చెడిపోయి, ఇటు తల్లిదండ్రుల ఆశ్రయానికి దూరమయ్యాయని పావని వాపోయింది. తన కాపురాన్ని నాశనం చేసిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని ఆమె కోరుతోంది.
Updated Date - 2020-12-29T06:38:55+05:30 IST