ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు
ABN, First Publish Date - 2020-12-29T06:30:15+05:30
ఆడపిల్ల పుట్టిందం టూ ఏడాదిన్నరగా భర్త కాపురానికి తీసుకువెళ్లట్లే దని ఒక వివాహిత చిన్నారితో కలిసి సోమవారం పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో బైఠాయించి అందోళనకు దిగింది.
- కాపురానికి తీసుకెళ్లడం లేదని వివాహిత ఆందోళన
- పోలీసుల జోక్యంతో విరమణ
పిఠాపురం, డిసెంబరు 28: ఆడపిల్ల పుట్టిందం టూ ఏడాదిన్నరగా భర్త కాపురానికి తీసుకువెళ్లట్లే దని ఒక వివాహిత చిన్నారితో కలిసి సోమవారం పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో బైఠాయించి అందోళనకు దిగింది. సుమారు రెండు గంటలకు పైగా అందోళన సాగింది. పోలీసుల జోక్యంతో అందోళన విరమించింది. గొల్లప్రోలు పట్టణానికి చెందిన మురాలశెట్టి అచ్చిరాజు పిఠాపురం మునిసిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి కత్తిపూడి గ్రామానికి చెందిన నందీశ్వరితో నాలుగున్నర సంవత్సరాల క్రితం వివాహమైంది. తొలుత మగబిడ్డ పుట్టి చనిపోగా రెండోసారి ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచీ తనను పట్టించుకోకుండా పుట్టింటి లో వదిలివేశాడని, కాపురానికి తీసుకువెళ్లడం లేద ని నందీశ్వరి అందోళన చేపట్టింది. ఆడ బిడ్డ పుట్టడమే తప్పయినట్టు మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు కనీసం బిడ్డను చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను వదిలివేస్తే తన భర్తకు ఇంకో పెళ్లి చేస్తానని అతడి అక్క చెప్తోందన్నారు. అంతేగాక బిడ్డ తనకు పుట్టలేదని అంటున్నారని చెప్పారు. తాను ఇంటి వద్ద ఉన్నప్పుడు గదికి తాళం వేసేవారంది. అన్నవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కాపురానికి తీసుకువెళతానని చెప్పి మార్గం మధ్యలో వదిలి వచ్చేశాడని చెప్పింది. తనను కాపురానికి తీసుకువెళ్లి బిడ్డను చూసుకుంటే చాలంది. ఈ సమయంలో అచ్చిరాజు వచ్చి నందీశ్వరితో వా గ్వివాదానికి దిగాడు. విషయం తెలుసుకున్న పిఠాపురం ఎస్‌ఐ శంకరరావు నందీశ్వరితో చర్చించారు. అన్నవరం పోలీసుస్టేషన్‌లో కేసు ఉన్నందున అక్కడ మరోమారు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె అందోళన విరమించింది.
Updated Date - 2020-12-29T06:30:15+05:30 IST