ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమలో అప్రమత్తం

ABN, First Publish Date - 2020-04-03T12:02:52+05:30

కోనసీమ ముఖద్వారమైన కొత్తపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి-అమలాపురం): కోనసీమ ముఖద్వారమైన కొత్తపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పన్నెండు రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంచేశారు. కొత్తపేటలో కరోనా సోకిన ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు కోనసీమవ్యాప్తంగా ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారిం చారు. కొత్తపేట నుంచి నలుగురిని రావులపాలెంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించగా అక్కడి ప్రజలు అడ్డుకోవ డంతో వారిని అమలాపురం రూరల్‌ మండలం భట్లపాలెంలో ఏర్పాటుచేసి క్వారంటైన్‌ కేంద్రానికి గురువారం సాయంత్రం తరలిస్తున్నారు. మలికిపు రంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులను ముందస్తు జాగ్రత్తగా కిమ్స్‌లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్టు సమాచారం.


రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కోనసీమలోని వివిధ ప్రాం తాల్లో పర్యటించి కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండడం ద్వారా ఈ వైరస్‌ను నిరోధించగలమని కలెక్టర్‌ స్పష్టంచేశారు. ఇక పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమలాపురం పట్టణంల ో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ అమలుపై కింది స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అలాగే పట్టణంలోకి వచ్చే అన్ని రహదారులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మ రం చేసి సరైన కారణాలు ఉంటేనే వ్యక్తులను పట్టణంలోకి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T12:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising