ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమరగిరి లేఅవుట్‌ అభివృద్ధి

ABN, First Publish Date - 2020-12-01T06:18:34+05:30

కొమరిగిరి లేఅవుట్‌ను మెగా టౌన్‌షిప్పుగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కొత్తపల్లి, నవంబరు 30: కొమరిగిరి లేఅవుట్‌ను మెగా టౌన్‌షిప్పుగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో అభివృద్ధి చేస్తున్న ఇళ్ల స్థలాల లేఅవుట్‌ స్థలాన్ని అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీలో ఇళ్లులేని  పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు వీలుగా కొమరగిరిలో ప్రభుత్వం స్థల సేకరణ చేసిందన్నారు. పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సైట్‌ను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీల వంటి సదుపాయాలతో పేదలకు  ఇళ్ల స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను  ఆదేశించారు. నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, అర్బన్‌, రూరల్‌ తహశీల్దార్లు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-01T06:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising