ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉప్పుటేరుపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి’

ABN, First Publish Date - 2020-11-28T06:22:37+05:30

కాకినాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంద్రపాలెం జంక్షన్‌ వద్ద ఉప్పుటేరుపై నిర్మిస్తోన్న మేడలైన్‌ వంతెన అక్రమ నిర్మాణాలు తొలగించాలని, దీన్ని నగరపాలక సంస్థ పాలకవర్గం పరిశీలించి కౌన్సెల్‌లో చర్చించాలని సీపీఎం జిల్లా బాధ్యుల బృందంతో శుక్రవారం ఆ ప్రాం తంలో పర్యటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంద్రపాలెం జంక్షన్‌ వద్ద ఉప్పుటేరుపై నిర్మిస్తోన్న మేడలైన్‌ వంతెన అక్రమ నిర్మాణాలు తొలగించాలని, దీన్ని నగరపాలక సంస్థ పాలకవర్గం పరిశీలించి కౌన్సెల్‌లో చర్చించాలని సీపీఎం జిల్లా బాధ్యుల బృందంతో శుక్రవారం ఆ ప్రాం తంలో పర్యటించిన కాకినాడ పౌరసంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వంతెన నిర్మాణ ప్రదేశంలో మూడు వైపుల నుంచి కాలువల మార్గాల నుంచి వస్తున్న నీరు సముద్రపాయలోకి ప్రవహించే వేగం లేకుండా 90 శాతం అడ్డుకట్ట వేయడాన్ని తాము గమనించామన్నారు. కేంద్ర నిబ ంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ ప్రైవేట్‌ వంతెన వల్ల వరదలకు కాకినాడ నగరం, గ్రామీణ ప్రాంతాల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. సంబంధిత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారుల బృందం పర్యటించి వంతెన అక్రమ నిర్మాణాలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. గతంలో కేంద్రం తిరస్కరించిన వంతెనను అడ్డగోలుగా మార్పు చేసి, అలైన్‌మెంట్‌ అనుమతులిచ్చిన బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉప్పుటేరు పరిసర డివిజన్‌ల ముంపునకు కారణమవుతున్న మేడలైన్‌ అంశంపై నగరపాలకసంస్థ కౌన్సెల్‌ అత్యవసరంగా సమావేశం నిర్వహించి, ఆక్రమణలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారని బృంద సభ్యులు హెచ్చరించారు.


Updated Date - 2020-11-28T06:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising