ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యం మేలును తెలిపేందుకు గ్రీన్‌ అంబాసిడర్ల నియామకం

ABN, First Publish Date - 2020-12-19T05:40:52+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 18: పారిశుధ్యం మెరుగు వల్ల కలిగే మేలును తల్లిదండ్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలను గ్రీన్‌ అంబాసిడర్లుగా నియమించామని కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా శుక్రవారం 35వ డివిజన్‌ కార్పొరేటర్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాలీలో పాల్గొన్న కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 18: పారిశుధ్యం మెరుగు వల్ల కలిగే మేలును తల్లిదండ్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలను గ్రీన్‌ అంబాసిడర్లుగా నియమించామని కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా శుక్రవారం 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ బలువూరు రామకృష్ణ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన ర్యాలీని కమిషనర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఆర్‌కాలనీలోని వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని, బొందగుంటలోని మెటీరియల్‌ రికవరీ ఫెసిలిట ప్లాంట్‌ను వారికి చూపిస్తామన్నారు. పిల్లలకు ఒక గ్రీన్‌ రిపోర్ట్‌ కార్డ్‌, పాస్‌బుక్‌ కూడా ఇస్తామన్నారు. విద్యార్థులు తమ గృహ వ్యర్థాలను ఏ విధంగా ఉపయోగకరంగా మారుస్తున్నారు అనే దాని ఆధారంగా వారికి పాస్‌బుక్‌లో మార్కులు వేసి బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. పిల్లలందరూ గ్రూపులుగా ఏర్పడి ప్రజలను నాటికలు, పాటలు, ర్యాలీల ద్వారా చైతన్యపరిచి స్వచ్ఛత రాయబారులుగా మారాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2020-12-19T05:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising