ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-10-04T09:34:55+05:30

ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, అక్టోబరు 3: భూస్వాముల ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలని, భూ తగాదాపై హైకోర్టులో సివిల్‌ కేసు కొనసాగుతున్నప్పటికీ అక్రమ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏలేశ్వరంలో దళితులు శనివారం ఆందోళన చేపట్టారు. సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏగుపాటి అర్జునరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు, జె.అన్నవరం గ్రామ దళితులు పాల్గొన్నారు. పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శన చేసి బాలాజీచౌక్‌ సెంటర్‌లో రాస్తారోకో, పోలీస్‌స్టేషన్‌వద్ద ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తహశీల్దార్‌ రజనీకుమారికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మసకపల్లి ధనబాబు, సాబే కొమ్మయ్య, నాగులాపల్లి అర్జునుడు, ఎద్దు బుజ్జమ్మ, బూరుగు చంటి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T09:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising