ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపు విదేశీ విద్యాదీవెనకు ఒక్క పైసా ఇవ్వలేదు

ABN, First Publish Date - 2020-12-13T06:19:02+05:30

కాపు విదేశీ విద్యాదీవెన పథకం కింద 18నెలలుగా ఒక్క పైసాకూడా ఎందుకు విడుదల చేయలేదో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర టెలీకం సెల్‌ కన్వీనర్‌ పాలూరి సత్యానందం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర టెలీకం సెల్‌ కన్వీనర్‌ పాలూరి సత్యానందం 

రాజమహేంద్రవరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కాపు విదేశీ విద్యాదీవెన పథకం కింద  18నెలలుగా ఒక్క పైసాకూడా ఎందుకు  విడుదల చేయలేదో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర టెలీకం సెల్‌ కన్వీనర్‌ పాలూరి సత్యానందం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం నుంచి ఈ పథకం కింద  వందలాది మంది పేద కాపు విద్యార్థులు  విదేశాలలో విద్య అభ్యసిస్తున్నారని, వారికి ప్రతీ కోర్సుకు  రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. జగన్‌ సర్కార్‌ ఒక్క విద్యార్థికి కూడా కాపు కార్పొరేషన్‌ ద్వారా సహాయం అందించకపోగా, ఇప్పటికే చదువుకుంటున్న  విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయి సొమ్మును ఇవ్వలేదని దీంతో వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో మనోక్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ విద్యానిధి కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ నిధికి ఈనెల 5న జగన్‌ రూ.25కోట్లు  విడుదల చేశారని, ఇలాగే  కాపు విద్యార్థులకు ఎందుకు ఇవ్వకుం డా వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాపు కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎంపీలకు ఈపేద కాపు విద్యార్థుల గోడు పట్టడంలేదని, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా ఎందుకు  నోరు విప్పడంలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా  యువతను ఆదుకోవాలని, పెండింగ్‌ సొమ్ములు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ సమస్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ స్పందించి, సీఎంకు లేఖ రాసి ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.



Updated Date - 2020-12-13T06:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising