ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కాపవరంలో అక్రమ మైనింగ్‌పై విచారణ నిర్వహించాలి’

ABN, First Publish Date - 2020-09-29T17:53:54+05:30

బిక్కవోలు మండలం కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నుంచి ఇళ్ల స్థలాలకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనపర్తి/బిక్కవోలు: బిక్కవోలు మండలం కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నుంచి ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణ నిర్వహించాలని సోమవారం రాజమహేంద్రవరంలోని గనులు, భూగర్భ వనరుల శాఖ సహాయ సంచాలకుడికి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. కాపవరంలో నాగార్జున పెర్టిలైజర్స్‌ సంస్థ నుంచి సేకరించిన 201 ఎకరాలను చదును చేసేందుకు మూడు తాత్కాలిక పర్మిట్లు మాత్రమే పొందారని, దీనిని అడ్డు పెట్టుకుని లారీల్లో గ్రావెల్‌ను ప్రయివేటు స్థలాలకు తరలిస్తున్నారన్నారు.


ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమికి సొమ్ములు చెల్లించినప్పటికీ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోకుండా నిలుపుదల చేయించి వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ పెండ్యాల నళినీకాంత్‌, కొట్టు సత్తిబాబు, చక్రరావు, ఆదినారాయణ, రామేశ్వరం చౌదరి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-09-29T17:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising