ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల పేరుతో భారీగా అవినీతి

ABN, First Publish Date - 2020-10-02T08:37:33+05:30

పేదలకు ఇళ్లస్థలాల పేరుతో భారీగా అవినీతి జరిగిందని, ప్రతీ నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్ల మేర అధికారపార్టీ నేతలు దండుకున్నారని టీడీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌



పిఠాపురం, అక్టోబరు 1:పేదలకు ఇళ్లస్థలాల పేరుతో భారీగా అవినీతి జరిగిందని, ప్రతీ నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్ల మేర అధికారపార్టీ నేతలు దండుకున్నారని టీడీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆరోపించారు. పిఠాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలకు ఇళ్లస్థలాల వ్యవహారం కాసులు కురిపించిందన్నారు. ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి టీడీపీ అడ్డుపడుతోందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. 80శాతంపైగా ఇళ్లస్థలాల పంపిణీకి ఎటువంటి వివాదాలు, కోర్టు కేసులు లేవని, వాటిని ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులతో పలువురు కోర్టులను ఆశ్రయించారని, ఇందులో టీడీపీకి సంబంధం ఉందనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 17నెలల కాలంలో నియోజకవర్గంలో రూ.30 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రావెల్‌, మట్టి తవ్వకాలు, ఇళ్లస్థలాలు ఇలా ప్రతి విషయంలో అధికారపార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 

Updated Date - 2020-10-02T08:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising