ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వికాసలో మిని జాబ్‌ మేళా

ABN, First Publish Date - 2020-11-30T06:58:14+05:30

వికాస ఆధ్వర్యంలో ఈ నెల 30న మిని జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), నవంబరు 29: వికాస ఆధ్వర్యంలో ఈ నెల 30న మిని జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో క్లన్డ్‌సీడ్‌ టెక్నాలజీస్‌ సంస్థలో ప్రెషర్‌ ప్రోగ్రామర్‌, యూఐ, యూఎక్స్‌డిజైనర్‌, జావా డెవలపర్‌, సీ ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, బీటెక్‌ (ఐటీ, సీఎస్‌ఈ, ఈఈఈ), ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణులైన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఐటెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ట్రైనీ డెవలపర్‌, ఎస్‌ఆర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీస్‌ ఇన్‌చార్జి ఉద్యోగాలకు ఏదైనా డి గ్రీ, బీఎస్‌సీ-సీఎస్‌, ఎంసీఏ, బీటెక్‌(ఆల్‌ బ్రాంచ్స్‌) చేసిన వారు అర్హులన్నారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థలో అప్రెంటీస్‌ ట్రైనీ, అసోసియేట్‌ ఉద్యోగాలకు డిప్లమో మెకానిక్‌, ఐటీఐ ఫిట్టర్‌ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. హోండాయ్‌ మొబీస్‌ (కియా అనుబంధ సంస్థ)లో టె క్నీషియన్‌ ఉద్యోగానికి డిప్లమో మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆర్‌ఎంఐపీఎల్‌ సంస్థలో మొబైల్‌ అసెంబ్లర్‌  ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకు ఆయా ఉద్యోగాలను బట్టి జీతం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్లు 0884- 2352767లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-11-30T06:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising