ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగు మారిన ధాన్యాన్ని కొంటాం

ABN, First Publish Date - 2020-12-03T05:45:25+05:30

వరదలు, తుఫానులు కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రంగు మారిన, దెబ్బతిన్న ఽధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: జేసీ లక్ష్మీశ

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 2: వరదలు, తుఫానులు కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రంగు మారిన, దెబ్బతిన్న ఽధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు.  వ్యవసాయ అధికారులతో బుధవారం కలెక్టరేట్‌ నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా క్షేత్రస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 45 వేల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం రంగు మారినట్లు అంచనా వేశామన్నారు. రంగు మారిన ఽధాన్యం సేకరణ నిమిత్తం జిల్లా స్థాయి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ఏ విధమైన సమస్యలు తలెత్తినా కాల్‌ సెంటర్‌ నంబర్‌ 88866 13611కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. అదే విధంగా ప్రతి 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక ప్రత్యేక బృందాన్ని, కాల్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. వరదలు, తుఫాన్‌లు కారణంగా రంగు మారిన, దెబ్బతిన్న ఽధాన్యాన్ని ప్రధానంగా బాయిల్డ్‌  రైస్‌ మిల్లర్లు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జేసీ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.  జిల్లా వ్యవసాయ శాఖ జేడీ కేవీఎస్‌ ప్రసాద్‌, డీడీలు వీటి రామారావు, ఎస్‌.మాఽధవరావు, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-03T05:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising