ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ద్వారంపూడి వైఖరిని ఖండిస్తున్నాం

ABN, First Publish Date - 2020-11-26T05:35:16+05:30

సర్పవరం జంక్షన్‌, నవంబరు 25: టిడ్కో గృహాలు, మేడలైన్‌ వంతెన నిర్మాణ పనుల అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభా్‌ష చంద్రబో్‌సపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు

సమావేశంలో మాట్లాడుతున్న పంతం నానాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ 

సర్పవరం జంక్షన్‌, నవంబరు 25: టిడ్కో గృహాలు, మేడలైన్‌ వంతెన నిర్మాణ పనుల అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభా్‌ష చంద్రబో్‌సపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ తెలిపారు. బుధవారం ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ రోడ్డులో శుభంకాపు కల్యాణ మండపంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో నలుగురు మంత్రుల ఆధ్వర్యాన వైసీపీ ఎంపీ, బీసీ నాయకుడు బోస్‌పై ద్వారంపూడి దూషణపర్వం సాగిసున్నా ఏ ఒక్క మంత్రి వారించకపోవడం శోచనీయమన్నారు. ఎమ్యెల్యేకు భయపడి మంత్రి పదవులు చేసే బదులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెట్టిస్తున్న ద్వారంపూడి ఇప్పుడు బోస్‌పై ఎటువంటి దాడులు చేస్తారో, ఎంతటి అక్రమ కేసు పెడతారోనని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కిట్లు, ఇళ్ల స్థలాలు, మేడలైన్‌ వంతెన నిర్మాణంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందన్నారు. ఈ విషయమై సీఎం జగన్‌ విచారణ నిర్వహించి తగిన చ ర్యలు తీసుకోవాలని నానాజీ డిమాండ్‌ చేశారు. సమావేశంలో నూకల నారాయణరావు, డేగల సతీ్‌ష, కరెడ్ల గోవిందు, ఆర్‌ దుర్గారావు, తాటికాయల బుజ్జి, దాసరి శివ, దమలింక బూరయ్య, వీరబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising