ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

90,979 మందికి ‘జగనన్న తోడు’

ABN, First Publish Date - 2020-11-26T05:49:24+05:30

‘జగనన్న తోడు’ ద్వారా జిల్లాలో మొత్తం 90,979 మందికి రూ. 90.97 కోట్ల లబ్ధి చేకూరనుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డెయిరీపారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 25: ‘జగనన్న తోడు’ ద్వారా జిల్లాలో మొత్తం 90,979 మందికి రూ. 90.97 కోట్ల లబ్ధి చేకూరనుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించగా కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాయింట్‌ కలెక్టర్లు జి.రాజకుమారి, చేకూరి కీర్తితో కలిసి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 62,898 మంది లబ్ధిదారులకు రూ.62.89 కోట్లు, పట్టణ ప్రాంతాలకు చెందిన 28,081 మందికి రూ.28.08 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు.  రూ.10 వేలు చొప్పున బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. సంవత్సర వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాధ్‌, మెప్మా పీడీ కె.శ్రీరమణి, ఎల్‌డీఎం షణ్ముఖరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-11-26T05:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising